ఆళ్లగడ్డ: ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ పేర్కొన్నారు, మంగళవారం ఉదయం ఆళ్లగడ్డ పట్టణంలోని దొమ్మర కాలనీలో నిర్వహించిన డోర్ టు డోర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు, ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు స్థానిక అవసరాలను అడిగి తెలుసుకున్నారు, ప్రజలు తెలిపిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కాలనీ ప్రజలకు హామీ ఇచ్చారు