కోనారావుపేట: వ్యవసాయ బావిలో పడి రైతు రామస్వామి మృతి సుద్దాల గ్రామంలో తీవ్ర విషాదం
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన రైతు కొంటెల్లి రామస్వామి (45) ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి దుర్మరణం పాలయ్యారు. ఆదివారం సాయంత్రం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన రామస్వామి రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పొలం వద్దకు వెళ్లి చూడగా, బావిలో శవమై కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని బావి నుంచి వెలికి తీశారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.