రాజేంద్రనగర్: శేర్ లింగంపల్లిలో తెలంగాణ బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమావేశం
శేరిలింగంపల్లిలో తెలంగాణ బీసీ కుల సంఘాల ఐక్యవేదిక నాయకులు సమావేశం నిర్వహించారు. దీంట్లో రాబోయే ఎన్నికల గురించి చర్చించి, బీసీలు ఐక్యంగా ఉండి, ఇతర బలహీన వర్గాల సహకారంతో రాజకీయ అధికారం సాధించాలని నాయకులు తీర్మానించారు. అలాగే, బండి రామకృష్ణ గౌడ్‌ను ఈ సంఘం కొత్త రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ ఆయనకు నియామకపత్రాన్ని అందించారు.