ఒంగోలు అర్బన్: ఒంగోలులో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్లు అందజేసిన ఎమ్మెల్యే జనార్దన్ రావు
Ongole Urban, Prakasam | May 1, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో శుక్రవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు హాజరై లబ్ధిదారులకు స్వయంగా ఇళ్ల వద్దనే పెన్షన్లు అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు ప్రతినెల 1వ తేదీలోపు లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే పెన్షన్లు అందిస్తున్నారని అన్నారు. మేలు చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే కోరారు.