డోన్: మహిళలు అప్రమత్తంగా ఉండాలి: డోన్ సీఐ ఇంతియాజ్ భాష
Dhone, Nandyal | May 26, 2026 నంద్యాల జిల్లా డోన్ మండలం కొండపేటలో మహిళా రక్షణే మన బాధ్యత కార్యక్రమాన్ని సీఐ ఇంతియాజ్ బాషా ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలపై జరిగే అఘాయిత్యాలు, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, ఈవ్తోజింగ్ తదితర వాటిపై మహిళలకు అవగాహన కల్పించామన్నారు. మహిళలు బయటకు వెళ్లేటప్పుడు విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.