నందవరంలో వైభవంగా అమ్మవారి పల్లకి సేవ
బనగానపల్లె మండలంలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన నందవరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం రాత్రి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. కార్తీక శుక్రవారం సందర్భంగా వేద పండితులు అమ్మవారి ఉత్సవ మూర్తులను పల్లకిపై ప్రత్యేకంగా అలకారం చేసి పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరమ్మ, ఆలయ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.