తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఆర్డిఓ కార్యాలయంలో సోమవారం ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు సమస్యలపై వచ్చిన అర్జీదారులతో ఆర్డీవో కిరణ్మయి వివరంగా మాట్లాడారు. ఈ క్రమంలో ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమానికి పలు సమస్యలపై పది అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను ఆర్డీవో కిరణ్మయి ఆదేశించారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.