కనిగిరి పట్టణంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్ పోలియోపై అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ శనివారం ప్రారంభించారు. పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాల నుండి ప్రారంభమైన ఈ అవగాహన ర్యాలీ కార్యక్రమం చర్చి సెంటర్ వద్ద వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ... ఆదివారం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో తల్లిదండ్రులు బాధ్యత తీసుకొని తమ చిన్నారులకు పోలియో చుక్కలను వేయించాలని సూచించారు. పోలియో చుక్కలు వేయించడం ద్వారా చిన్నారులకు పోలియో వ్యాధి సోకకుండా చూసుకోవచ్చన్నారు.