ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి కాంగ్రెస్ నేత రామాగౌడ్ కు కన్పించిన అదృశ్యమైన హమీద్ ను కుటుంబ సభ్యులకు అప్పగించారు
ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన మహమ్మద్ హమీద్ (45) మతిస్థిమితం కోల్పోయి తప్పిపోయిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని బొల్లారం వద్ద కాంగ్రెస్ నేత రామాగౌడ్ కు ఆయన కనిపించారు. వెంటనే రామాగౌడ్ ఎల్లారెడ్డి మాజీ జడ్పిటీసి గయజొద్దీన్కు సమాచారం అందించారు. రామాగౌడ్ హమీద్ ను సాయంత్రం ఐదు గంటలకు ఎల్లారెడ్డికి తీసుకువస్తున్నట్లు తెలిపారు. హమీద్‌ను గుర్తించి మానవత్వంతో తీసుకువస్తున్న రామాగౌడ్‌కు గయాజ్, హమీద్ తండ్రి ఖాజా కృతజ్ఞతలు తెలిపారు.