డోన్: సీఎం సభకు వ్యాఖ్యాతగా బేతంచెర్ల మండల ఉపాధ్యాయుడు గంగుల నాగరాజు
Dhone, Nandyal | Jul 8, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం గోరుమానుకొండ ఏపీ మోడల్ స్కూల్లో తెలుగు ఉపాధ్యా యుడిగా విధులు నిర్వహిస్తున్న గంగుల నాగరాజుకు అరుదైన గౌరవం దక్కింది. బనగానపల్లెలో గురువారం(9న) నిర్వహించనున్న సీఎం సభకు ఆయనను వ్యాఖ్యాతగా ఎంపిక చేశారు. తెలుగు భాషపై మంచి పట్టు, స్పష్టమైన వాక్చాతుర్యం, వేదిక నిర్వహణలో అనుభవం ఉండటంతో ఈ అవకాశం లభించినట్లు తెలిసింది. సీఎం సభకు వ్యాఖ్యాతగా ఎంపిక కావడం పట్ల సహచర ఉపాధ్యా యుల అభినందించారు