పలమనేరు: బైరెడ్డిపల్లి: నిద్రపోతున్న వ్యక్తిని లేపి గొడ్డును బాదినట్లు బాదిన వ్యక్తులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
బైరెడ్డిపల్లి: మండలం తాతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బాలకృష్ణ మీడియాకు వెల్లడించిన వివరాల మేరకు. మంగళవారం రాత్రి తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో బాలేపల్లి గ్రామానికి చెందిన ఆదినారాయణ రెడ్డి వారి అనుచరులు కొంతమంది నన్ను నిద్ర లేపి మాట్లాడే పని ఉందని తీసుకెళ్లి ఇష్టానుసారం గుడ్డును బాదినట్లు ఒంటిపైన వాతలు పడేలా పైపుతో దాడి చేసినట్లు వాపోయాడు. అకారణంగా ఎందుకు నన్ను కొడుతున్నారని ప్రశ్నించగా నానా దుర్భసలాడుతూ మరోసారి మూకుమ్మడిగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేసి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసామని తెలిపాడు.