నంద్యాల అర్బన్: నంద్యాలలో ఘనంగా అయ్యప్ప స్వామి 36వ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం
Nandyal Urban, Nandyal | Jul 7, 2026
నంద్యాలలోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో మంగళవారం 36వ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించినట్లు శ్రీ స్వామి అయ్యప్ప సేవా సమాజం సభ్యులు తెలిపారు. స్వామివారికి పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వారు తెలిపారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు. లక్ష్మయ్య గురుస్వామి, నాగరాజు, శ్రీకాంత్, వెంకట సుబ్బయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.