డోన్: బేతంచెర్ల లో కనబడకుండా పోయిన ఇద్దరు ఆడపిల్లలను తిరిగి తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
Dhone, Nandyal | Jun 22, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్లకు పట్టణానికి చెందిన ఇద్దరు బాలికలు శుక్రవారం ఇంటి నుంచి నానమ్మ ఇంటికి వెళ్తున్నామని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చేపట్టి డోన్ రైల్వే స్టేషన్లో బాలికలను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.