కోడుమూరు: ప్యాలకుర్తిలో పంట నమోదును సూపర్ చెకింగ్ చేసిన జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్
కోడుమూరు మండలంలోని ప్యాలకుర్తి గ్రామంలో పంట నమోదు చేసిన వివరాలను జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ మంగళవారం సూపర్ చెకింగ్ చేశారు. ఈ సందర్భంగా ర్యాండం చెకింగ్ చేస్తూ వివరాలను సరి పోల్చారు. రైతులనడిగి సాగుచేసిన పంట వివరాలు, క్రాప్ బుకింగ్ వివరాలను పరిశీలించారు. ప్రభుత్వ మద్దతు ధరననుసరించి పంటలు సాగు చేసుకుంటే నష్టాలను అధిగమించవచ్చని రైతులకు జాయింట్ కలెక్టర్ సూచించారు.