దేవరకద్ర: కౌకుంట్ల మండల కేంద్రంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం.
మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో గురువారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఉరుములతో కూడిన వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగస్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీవల వర్షాల వల్ల పత్తి పంట దెబ్బతిన్న రైతులు ఈ వర్షంతో మరింత నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం కారణంగా వాతావరణం చల్లబడింది.