విశాఖపట్నం: ప్రమాదకరంగా మారిన వై జంక్షన్ నుంచి స్టీల్ ప్లాంట్ వెళ్లే రోడ్డు
వై జంక్షన్ నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి వెళ్లే రహదారి ప్రమాదకరంగా మారటంతో వాహన చేతకులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. తరచు కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు బురదమయం గా మారడంతో పాటు భారీ ఎత్తున గుంతలు ఏర్పడటంతో ఎక్కడపడితే అక్కడ ద్విచక్ర వాహనాలు స్కిడ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం రోజు స్కూటీ ప్రమాదానికి గురికాగా, ఇదే ప్రదేశంలో జరిగిన మరో స్కూలు విద్యార్ధికి కుడి చెయ్యి విరిగింది దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయంలో ప్రమాదం జరిగితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.