ఆళ్లగడ్డ: మూడు రాళ్ళపల్లె గ్రామంలో బైక్ పైనుంచి కింద పడి ఉపాధి కూలీలు
నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మూడు రాళ్ళ పల్లెకు చెందిన ఉపాధి కూలీ ఓబులమ్మ బైక్ పై నుంచి పడి మృతి చెందారు, ఉపాధి పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో కళ్ళు తిరిగి కింద పడ్డారు, స్థానికుల సహాయంతో 108 వాహనంలో కేరళ వైద్యశాలకు తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు, ఓబులమ్మ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలము కున్నాయి.