జహీరాబాద్: హుగ్గేల్లి శివారులో నీటి కుంట లో ఈత కొట్టేందుకు వెళ్లి బాలుడు గల్లంతు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని హుగ్గేల్లి శివారులో నీటి కుంటలో మునిగి బాలుడు గల్లంతయిన సంఘటన చోటుచేసుకుంది. కోహిర్ మండలంలోని పీచేరేగడి గ్రామానికి చెందిన రిజ్వాన్, సలీం, గుళ్ళు అనే ముగ్గురు ఉగ్గేల్లి గ్రామ శివారులోని నీటి కుంటలో సోమవారం మధ్యాహ్నం ఈత కొట్టేందుకు వెళ్లి ఈత రాక నీట మునిగి రిజ్వాన్ అనే బాలుడు గల్లంతయినట్లు స్థానికులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న జహీరాబాద్ రూరల్ పోలీసులు, ఫైర్ సిబ్బంది నీటి కుంటలో బాలుడి కోసం గాలింపు చేపట్టారు.