ఆత్మకూరు: సర్పంచ్ ను ఎస్సై దుర్భాషలాడాడంటూ పోలీస్ స్టేషన్ ను మొట్టడించిన గ్రామస్తులు
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, ఏఎస్ పేట పోలీస్ స్టేషన్ ను గత రాత్రి చౌట భీమవరం గ్రామస్థులు ముట్టడించారు. CC రోడ్డు నిర్మాణ విషయంలో ఎస్సై సైదులు చౌట భీమవరం సర్పంచ్ ను స్టేషన్ కు పిలిపించి తీవ్రంగా దుర్భాషలాడినట్లు సర్పంచ్ ఆరోపించారు. దీంతో గ్రామస్థులు తమకు న్యాయం చేయాలంటూ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తామని సిఐ వేమారెడ్డి హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ గురువారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.