ఆళ్లగడ్డ: పరిశుభ్రతతోనే వ్యాధులకు చెక్ : జిల్లా మలేరియా అధికారి చంద్రశేఖర్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని ఏసునాధపురం వీధిలో జిల్లా మలేరియా అధికారి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కీటక జనిత వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు, సిబ్బంది ఇంటింటికి వెళ్లి లార్వా సర్వే చేపట్టారు, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా నివారణ పై ప్రజలకు సూచనలు చేశారు, ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే పాటించాలని కోరుతూ పాంప్లెట్లు పంపిణీ చేశారు, పలు జాగ్రత్తలతో దోమలు వ్యాప్తిని అరికట్టవచ్చు అన్నారు, ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు