పిట్లం: పిట్లంలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు
పిట్లంలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు.. కామారెడ్డి జిల్లా పిట్లంలో బారెడు పోచమ్మ బోనాల ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. నెత్తిన బోనాలను ఎత్తిన మహిళలు, సాంప్రదాయ దుస్తులు ధరించి బాజా భజంత్రీల నడుమ పోతరాజుల విన్యాసాలతో సాయంత్రం 6 వరకు బోనాలను ఊరేగించారు. ఊరి ప్రధాన వీధుల గుండా ర్యాలీ తీస్తూ ఊరి పొలిమేరలోని బారెడు పోచమ్మ ఆలయంలో బోనాలను సమర్పించారు. అనంతరం అమ్మవారికి తమ కోరికలు తీరలంటూ మొక్కులు చెల్లించుకున్నారు.