విశాఖపట్నం: విశాఖ: వెండి వినాయకుడ్ని చూసేందుకు బారులుదీరిన భక్తులు
విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వెండితో చేసిన వినాయకుడిని దర్శించుకునేందుకు ఆదివారం రాత్రి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వేలాది మంది భక్తులు గణేశుడిని దర్శించుకుని, పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా కూచిపూడి, భరతనాట్యం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ నెల 17న నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.