రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేని ప్రభుత్వం ఉంటే ఎంత పోతే ఎంత మాజీ ఎమ్మెల్యే కాసు
పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో వైయస్సార్సీపి జిల్లా స్థాయి ఎస్సీ సెల్ కార్య నిర్వాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేని ప్రభుత్వం ఉంటే ఎంత పోతే ఎంత అంటూ పేర్కొన్నారు. కనీసం పేద విద్యార్థుల కోసం కాలేజీలను పూర్తి చేయకుండా లంచాలు తీసుకొని కాలేజీల్లో అమ్ముకుంటున్న చంద్రబాబు ఉంటే అంతా పోతే ఎంత అంటూ తెలిపారు.