అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామంలో శనివారం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నివారణ చర్యలను వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో ముందస్తు నివారణ చర్యలో భాగంగా మలాథియం ద్రావణాన్ని పిచికారి, ఇంటింటా ఫీవర్ సర్వే, దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత, డ్రైడే కార్యక్రమాలఫై ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది గ్రామపంచాయతీ అధికారులు సర్పంచ్ల సహకారంతో నివారణ చర్యలు చేపట్టారు.