నంద్యాల అర్బన్: నల్లమల అటవీ ప్రాంతంలో రైలు ఢీకొని మృతి చెందిన పెద్దపులి T-160Fగా గుర్తించిన అటవీశాఖ అధికారులు
Nandyal Urban, Nandyal | May 26, 2026
నంద్యాల-గిద్దలూరు రైలు మార్గంలో చలమ, బొగద సమీపంలో గూడ్స్ రైలు ఢీకొని ఆదివారం రాత్రి పెద్దపులి మృతి చెందిన విషయం తెలిసిందే. మృతి చెందిన పెద్దపులిని T-160F (ఆడ పులి)గా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. దాని వయసు సుమారు నాలుగు నుంచి ఐదేళ్ల వరకు ఉంటుందన్నారు. ఇటీవల ఇదే రైలు మార్గంలో చిరుత పులి, ఎలుగు బంట్లు మృతి చెందిన ఘటనలు చోటుచేసుకున్నాయి.