ఒంగోలు అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సమయంలో మార్పు: జిల్లా కలెక్టర్
Ongole Urban, Prakasam | Apr 25, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్ ) కార్యక్రమం సమయంలో మార్పులు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజాబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేసవి కాలం ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఈనెల 27వ తేదీ( సోమవారం) న కలెక్టరేట్లో జరగబోవు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వివరించారు. జిల్లాలోని ప్రజలు మార్పును గమనించాలని కోరారు. ప్రజలు నిర్దేశించిన సమయానికి కార్యక్రమానికి చేరుకొని వారి వారి సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు అందజేయాలని సూచించారు.