ఒంగోలు అర్బన్: పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు : జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Apr 23, 2026
పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకొని ఒంగోలులోనీ కేశవ స్వామి పేటలో ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ రాజాబాబు, పలు సంఘాల ప్రతినిధులు, జిల్లా అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజాబాబు, మీడియాతో మాట్లాడుతూ, గంగను దీవి నుంచి భూమికి దింపిన మహనీయుడు భగీరథుడని, మనం ఏదైనా ప్రయత్నం చేసేటప్పుడు దానిని భగీరథ ప్రయత్నంతో పోల్చడం మనందరికీ ఆనవాయితీ అని అన్నారు. మానవుడు పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏమిఉండదని నిరూపించిన మహనీయులు అన్నారు