కనిగిరి: నారపరెడ్డిపల్లి సమీపంలో ఆటో బోల్తా, ముగ్గురికి గాయాలు
కనిగిరి: ఆటో బోల్తా పడి ముగ్గురికి గాయాలైన సంఘటన కనిగిరి -పామూరు జాతీయ రహదారిపై నారపరెడ్డి గ్రామ సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కనిగిరి నుండి పామూరు వైపు వెళ్తున్న ఆటోను నార్పరెడ్డి పల్లి సమీపంలో జాతీయ రహదారిపై వెనుక నుండి వచ్చిన. టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఆటో బోల్తాపడడంతో ఆటో డ్రైవర్ తో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు గాయపడ్డ వారిని వైద్యశాలకు తరలించారు.