కరీంనగర్: బతుకమ్మ దసరా సెలవులకు ఇంటికి తాళం వేసి వెళ్లే ప్రజలు ముందస్తుగా పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలి: సిపి గౌష్ ఆలం
కరీంనగర్ పోలీస్ కమిషనర్ పరిధిలోని ప్రజలు దసరా సెలవులలో దొంగతనాల పై అప్రమత్తంగా ఉండాలని సిపి గౌష్ ఆలం ఆదివారం తెలిపారు. దసరా బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రజలు తమ ఇళ్లకు తాళాలు వేసి సొంత ఊర్లకు వెళ్లే సందర్భాలు ఎక్కువగా ఉంటాయని, ఆ సమయంలో చోరీలు నివారించడానికి పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఊర్లకు వెళ్లే ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని, పెట్రోలింగ్ చేసే బృందాలకు ఇంటిపై ప్రత్యేక నిగా ఉంచడానికి సహాయపడుతుందని తెలిపారు. ఊరికి వెళ్లే సమయంలో ఇంటి చుట్టుపక్కల ఇంటి వద్ద ఉండే వారికి కూడా తెలపాలని, ఏమైనా అనుమానస్పదంగా ఉంటే వెంటనే పోలీసు లకు సమాచారం అందించాలన్నారు.