కోడుమూరు: మునగాలపాడు లో అర్జున్ మృతదేహానికి నివాళి అర్పించిన ఎంపీ బస్తిపాటి నాగరాజు
కోడుమూరు నియోజకవర్గం లోని మునగాలపాడు గ్రామానికి చెందిన అర్జున్ ప్రధాని నరేంద్ర మోడీ సభకు వస్తూ విద్యుదాఘాతంతో మృతి చెందిన విషయం తెలిసిందే. శుక్రవారం అర్జున్ మృతదేహానికి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పూలమాలవేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ప్రభుత్వపరంగా ఆర్థికంగా ఆదుకోవడంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. ఇదే ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరిని ఎంపీ పరామర్శించి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు.