ముంపు బాధితులకు జీవో 98 అమలు చేయాలని, జలవనరుల శాఖ మంత్రి రామానాయుడుకు రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షులు వినతి పత్రం
నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని శ్రీశైలం నీటి ముంపు బాధితులకు జీవో నెంబర్ 98 ప్రకారం ఉద్యోగాలు కల్పించాలని రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షులు కుంచం వెంకటసుబ్బారెడ్డి రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు, అమరావతి లోని క్యాంపు కార్యాలయంలో జల వనరుల శాఖ మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు, నందికొట్కూరులో నీటి ముంపు బాధితులు చేపట్టిన దీక్షలు మంగళవారం నాటికి 69 రోజుకు చేరాయని, వారికి న్యాయం చేయని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతను చేస్తామని ఆయన హెచ్చరించారు