రేపు ధర్మవరం మండలం తుమ్మలలో మంత్రి సత్యకుమార్ టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ పర్యటిస్తారు.
ధర్మవరం మండలం తుమ్మల గ్రామంలో రేపు సోమవారం మంత్రి సత్య కుమార్ ధర్మవరం టిడిపి ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ పర్యటిస్తారని ఎన్డీఏ కార్యాలయ వర్గాలు అధికార వర్గాలు తెలిపాయి. ఉదయం 9:30కు తుమ్మలలో ఆయుష్మాన్ భారత్ కింద నిర్మించిన వైద్య కేంద్రం రైతు సేవా కేంద్రం ప్రారంభిస్తారు. అనంతరం రైతులతో కలిసి జీఎస్టీ తగ్గింపుతో రైతులకు కలిగే ప్రయోజనాల గురించి చర్చిస్తారు.