హైదరాబాద్ కు ఉపాధి నిమిత్తం వెళ్లిన గూడూరు తిలక్ నగర్కు చెందిన కల్లూరు ఆకాశ్ రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు. కుటుంబీకులు తెలిపారు. మృత దేహాన్ని గురువారం గూడూరు తీసుకువచ్చారు. ఆకాశ్ తండ్రి సురేశ్ ఎలక్ట్రిషియన్ పనులు చేసుకుని జీవనం సాగిస్తుంటాడు. కుమారుడి మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.