పెద్దఅడిశర్లపల్లి: మారుమూల గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో తలెత్తే సమస్యలపై నివేదిక సమర్పించాలి: జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్గొండ జిల్లా, నందికొండ మున్సిపాలిటీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం సాయంత్రం సంబంధిత జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మారుమూల గ్రామాలు, అటవీ ప్రాంతాలలో నివసించే చెంచు, లంబాడా, గిరిజన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎదురవుతున్న ఇబ్బందులను అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో తమ వంతుగా కృషి చేయడానికి ముందుకు వచ్చిన నైస్ స్వచ్ఛంద సంస్థను అభినందించారు. ఐదు రాష్ట్రాలలో గిరిజనుల ఆరోగ్య సమస్యలపై పనిచేసిన అనుభవాలను అధికారులకు వివరించారు.