మనోహరాబాద్: మెదక్ జిల్లా కోనాయిపల్లిలో కుల వివక్ష: గుడిలోకి అనుమతి లేదంటూ ఆవేదన
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కోనాయిపల్లిలో బతుకమ్మ వేడుకల సమయంలో కుల వివక్ష ఘటన జరిగింది. తమను గుడిలోకి రానివ్వడం లేదని, కులం పేరుతో అవమానిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.