కర్నూలు: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి : జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి : జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. ఆదివారం కర్నూలు జిల్లాలో నేరనియంత్రణ మరియు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, నేరచరిత్ర గలవారు, చెడు నడత కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.సమాజంలో సత్ప్రవర్తనతో జీవించాలని, నేరప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని పోలీసులు వారికి సూచించారు.చట్టాన్ని అతిక్రమించి ఏవైనా నేర కార్యకలాపాలలో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవు అని అధికారులు హెచ్చరించారు.