గుంతకల్లు: వాహనదారులందరూ రికార్డులు కలిగి ఉండాలి, రికార్డులు లేకపోతే కేసులు నమోదు చేస్తాం: గుత్తిలో ఎస్సై సురేష్
వాహనదారులందరూ తప్పనిసరిగా రికార్డులను కలిగి ఉండాలి. సరియైన రికార్డులు లేకపోయినా, రోడ్డు నిబంధనలు ఉల్లంఘించినా కేసులు నమోదు చేస్తామని గుత్తి ఎస్సై సురేష్ హెచ్చరించారు. గుత్తిలోని ఎన్టీఆర్ సర్కిల్, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గురువారం రాత్రి తిరిగి శుక్రవారం ఉదయం ఆయన పోలీసు సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేపట్టారు. సరైన రికార్డులు, హెల్మెట్, లైసెన్స్, ఆర్సీ లేని వాహనదారులపై జరిమానా విధించారు. మొదటిసారి జరిమానాతో సరిపెడుతున్నామని మరోసారి రిపీట్ అయితే కేసులు నమోదు చేస్తామని వాహనదారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ నాగమాణిక్యం, హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్, పోలీసులు పాల్గొన్నారు.