ఒంగోలు అర్బన్: ఈ నెల 15 నుండి జరిగే సర్ ప్రక్రియకు అన్ని రాజకీయ పార్టీలను సహకరించాలని కోరిన జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Jun 12, 2026
పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ( సర్ ) ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు కోరారు. ఈనెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకూ బి.ఎల్.వో.లు ప్రతి ఇంటికీ వెళ్లి ఎన్యూమరేట్ చేయనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఈ.ఆర్.వో.లు, ఏ.ఈ.ఆర్.వో.లతో శుక్రవారం ప్రకాశం భవనంలో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులందరూ ఓటర్ల జాబితాలో ఉండాలన్నదే ఎలక్షన్ కమిషన్ చేపట్టిన ' సర్ ' లక్ష్యమన్నారు.