మాచవరంలో వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న ప్రజలు సమ్మె లో ఉన్న డాక్టర్లు
పల్నాడు జిల్లా మాచవరం మండలంలో గత వారం రోజులుగా వైరల్ ఫీవర్స్ బాగా పెరిగాయి. ఈ క్రమంలో డాక్టర్లు సమ్మెలో ఉన్నారు. ఒక్కసారిగా ఫీవర్ లు పెరిగిపోవడంతో పిడుగురాళ్ల డాక్టర్ అనిల్ కుమార్ ఇన్చార్జి బాధ్యతలు చేపట్టారు. గత వారం రోజులుగా వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయని ప్రజల అప్రమత్తంగా ఉండాలని శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో పేర్కొన్నారు. రోగులకు వైద్య పరిస్థితి నిర్వహించి వెంటనే సెలైన్సు బాటిల్స్ పెడుతున్నామని పేర్కొన్నారు. డాక్టర్స్ సమ్మెలో ఉన్న రోగులు ఇబ్బంది పడకుండా పిడుగురాళ్ల నుంచి ఇంచార్జిగా సేవలు అందిస్తున్నామన్నారు.