బనగానపల్లె: బనగానపల్లె మండలం లో వైకుంఠ సేవాసమితి ఆధ్వర్యంలో ఓ వ్యక్తికి అంత్యక్రియలు
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన ఈశ్వరయ్య (68) మృతి చెందగా, వైకుంఠ సేవసమితి సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడి భార్య పార్వతమ్మ, బంధువుల కోరిక మేరకు సభ్యులు నాగేశ్వర రెడ్డి, లక్ష్మీ రాఘవ, డా. సద్దాం, వెంకటేశ్వర్లు శ్మాశాన వాటికలో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్న సేవసమితి సభ్యుల చొరవను పలువురు అభినందించారు.