మత్స్యకారుల అభ్యున్నతికి కృషి చేస్తానని షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ అన్నారు. బుధవారం కొత్తూరు మండలంలోని సాయిరెడ్డి చెరువులో 30 వేల చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రలో తొలిసారిగా ముదిరాజ్ బిడ్డలను మత్స్యసహకార శాఖకు మంత్రిగా నియమించారని ఎమ్మెల్యే గుర్తుచేశారు.