హైదరాబాద్ ఎల్బీనగర్లోని హన్మకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్రెడ్డి నివాసంలో ACB అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ACB జాయింట్ డైరెక్టర్ రాధేష్ బుధవారం తెలిపారు. ఒక ప్రైవేట్ స్కూల్ లైసెన్స్ రెన్యువల్ కోసం రూ.60 వేల లంచం డిమాండ్ చేసిన కేసులో వెంకట్రెడ్డిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలిపారు. లంచం తీసుకుంటున్న సమయంలోనే ACB అధికారులు దాడి చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు తనిఖీల్లో సుమారు రూ.8 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు గుర్తించినట్లు తెలిపారు.