రాజమండ్రి సిటీ: బలబద్రపురంలో క్యాన్సర్ నివారణకు విస్తృత చర్యలు ఎమ్మెల్యే నల్లమిల్లి
బిక్కవోలు మండలం బలభద్రపురంలో క్యాన్సర్ ను గుర్తించి నివారణకు అవసరమైన చర్యలు చేపట్టినట్టు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు .సోమవారం బలబద్రపురంలో బసవతారకం ఇండో - అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో స్క్రీనింగ్ టెస్ట్ లను ఆయన ప్రారంభించారు. పలు కారణాలతో క్యాన్సర్ ప్రభలుతున్న విషయాన్ని గుర్తించుకుని ప్రజలు స్క్రీనింగ్ టెస్ట్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు.