నంద్యాల అర్బన్: నంద్యాలలో ట్రాక్టర్ నడిపి సందడి చేసిన నంద్యాల ఎంపి డాక్టర్ బైరెడ్డి
Nandyal Urban, Nandyal | Jun 29, 2026
నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి వేడుకల్లో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పాల్గొన్నారు. నేల తల్లి, ఎడ్లు, వ్యవసాయ పనిముట్లకు ప్రత్యేక పూజలు చేసి విత్తనం గొర్రు పట్టి స్వయంగా ట్రాక్టర్ నడిపి వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, రైతు ఆనందమే రాష్ట్ర అభివృద్ధికి పునాదని పేర్కొన్నారు.