అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా రామినేపల్లి వద్ద కూలీలతో వెళుతున్న ఆటోను ఢీకొన్న కారు ఓ కార్మికుడు మృతి
Anantapur Urban, Anantapur | May 3, 2026
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం లోని రాప్తాడు మండలం రామినేపల్లి వద్ద జాతీయ రహదారిపై కూలీలతో వెళుతున్న ఆటోను కారు ఢీకొన్న ఘటనలో సికె పల్లి మండలం వెంకటాంపల్లి గ్రామానికి చెందిన రమేష్ అనే కార్మికుడు మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.