సంగారెడ్డి: జిల్లా ఎస్పీ కార్యాలయంలో వందేమాతరం 150 వసంతాల వేడులు, పాల్గొన్న జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్
వందేమాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం సంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, పోలీస్ అధికారులతో కలిసి సామూహికంగా వందేమాతర గేయాన్ని ఆలపించారు. దేశభక్తి పూర్వక కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దేశభక్తి భావన కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.