కర్నూలు: విద్యా రంగ సమస్యలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి శ్రద్ధ లేదు: ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జీవన్ రాజు
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బస్సు యాత్రను చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం 11 గంటలకు కర్నూలు నగరానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో విద్యా రంగ సమస్యల పరిష్కారానికి తాము పోరాటానికి సిద్ధమవుతున్నామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జీవన్ రాజు తెలిపారు. రాష్ట్రంలో 17 నెలల కాలంలో విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విద్య రంగ సమస్యల పై దృష్టి సాధించలేదని వారు మండిపడుతున్నారు. నవంబర్ మాసంలో డీగ్రీ అడ్మిషన్లు జరుగుతున్నాయంటే విద్యారంగ పై మంత్రి నారా లోకేష్ కి ఎంత శ్రద్ధ ఉందో తెలుస్తుందని తెలిపారు.