ఒంగోలు అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక" లో వచ్చే ఆర్జీలను ప్రజల సంతృప్తే లక్ష్యంగా గడువులోపు పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్
Ongole Urban, Prakasam | Jun 1, 2026
ప్రజా సమస్యల పరిష్కార వేదిక" ( మీకోసం ) కార్యక్రమంలో వచ్చే ఆర్జీలను ప్రజల సంతృప్తే లక్ష్యంగా నిర్ణీత గడువు లోపు నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. సోమవారం ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాలులో నిర్వహించిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" ( మీకోసం ) కార్యక్రమంలో జిల్లా రెవెన్యు అధికారి శ్రీధర్ రెడ్డి, ఎస్డీసీ మాధురి, డిపిఓ వెంకటేశ్వరరావులతో కలసి పాల్గొని ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.