నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీగా ఖాదర్బాషా
Nandyal Urban, Nandyal | Jun 18, 2026
నంద్యాల జిల్లా ఏఎస్పీ(అడ్మిన్) గా ఖాదర్ బాషాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 16 మంది అడిషనల్ ఎస్పీ లను బదిలీ చేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నంద్యాల జిల్లా ఏఎస్పీ (అడ్మిన్) గా ఉన్న యుగంధర్ బాబు స్థానంలో ఖాదర్ బాషా త్వరలో బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలిసింది.ఈయన గతంలో కర్నూలు, డోన్ ప్రాంతాల్లో డీఎస్పీగా పనిచేశారు.