ఒంగోలు అర్బన్: ఒంగోలు నగర అభివృద్ధి, సుందరీకరణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగంగా పనిచేయండి : జిల్లా కలెక్టర్
Ongole Urban, Prakasam | May 5, 2026
ఒంగోలు నగర అభివృద్ధి, సుందరీకరణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ మరియు కార్పొరేషన్ ప్రత్యేక అధికారి శ్రీ.పి.రాజాబాబు స్పష్టం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఒంగోలు పురపాలక సంఘం ఏర్పడి 150 ఏళ్లు పూర్తి కాబోతున్న దృష్ట్యా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల పురగతిపై సందర్భంగా ఆయన ఆరా తీశారు. కార్పొరేషన్ నిర్వహిస్తున్న ఆయా కార్యక్రమాలలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేలా వారికి మరింత అవగాహన కల్పించాలన్నారు.